Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు జీవీఎల్ కౌంటర్

చంద్రబాబుకు జీవీఎల్ కౌంటర్
X

‘ఇంట్లో పిల్లి..వీధిలో పులి అంటే ఇదేనా?. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఇఛ్చిన కౌంటర్. న్యూఢిల్లీలో ఆదివారం నాడు జరిగిన నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోబోతే..ఆయన 20 నిమిషాలు ప్రసంగించారని..ఏపీ సమస్యలు అన్నీ ప్రస్తావించానని ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై జీవీఎల్ ట్విట్టర్ వేదిక ద్వారా రియాక్ట్ అయ్యారు.

నీతి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాల ప్రచారం. ప్రతి సీఎంకు కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. ముఖ్యమంత్రి నాయుడు 12 నిమిషాలు మాట్లాడారు. సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టిడిపి తప్పుడు ప్రచారం పూర్తిగా ఈ చిత్రాల ద్వారా బహిర్గతం అంటూ ఫోటోలను విడుదల చేశారు.

Next Story
Share it