Telugu Gateway
Cinema

గోపీచంద్ ‘పంతం’ టీజర్

గోపీచంద్ ‘పంతం’ టీజర్
X

గోపీచంద్ కు అభినయంతో పాటు టాలీవుడ్ లో హీరోగా వెలిగిపోయేందుకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా..కాలం మాత్రం కలసి రావటం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు అన్నీ బిలో యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకున్నాయి. ఈ హీరో ఇప్పుడు తన 25వ సినిమాగా ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ 25వ సినిమా అయినా గోపీచంద్ ను గాడిన పెడుతుందా? లేదా వేచిచూడాల్సేందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ‘చెప్పుకోవటానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకుంటున్న కథే.

థర్టీ ఇయర్స్ ఫృథ్వీ ఇప్పటికైనా చెప్పండి మీరు అసలు ఏమి చేస్తారు అంటూ గోపీచంద్, శ్రీనివాసరెడ్డిలను ప్రశ్నిస్తే ‘లోపలిది బయటకు తీస్తాం. బయటది లోపలికి తోస్తాం’. టింగ్ ..టింగ్ అంటూ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. కె.చక్రవర్తిని దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్.

https://www.youtube.com/watch?v=ZrcPvPDtjnE

Next Story
Share it