Telugu Gateway
Andhra Pradesh

ఏపీ డిప్యూటీ సీఎంకు ఈ సారి ఇంటిదారే!

ఏపీ డిప్యూటీ సీఎంకు ఈ సారి ఇంటిదారే!
X

ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార టీడీపీ..ఈ సారి గట్టి దెబ్బ తినబోతోంది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం..రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాల్లో గ్యారంటీగా ఓడిపోయే సీట్లలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉంటారని ఓ సర్వే నిగ్గు తేల్చింది. చినరాజప్ప ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పరిస్థితి ప్రస్తుతం టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేదని ఈ సర్వేలో తేలింది. ఈ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న బొడ్డు భాస్కరరామారావుకు, చినరాజప్పకు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దీనికి తోడు బొడ్డు భాస్కరరామారావు వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీ లేదా జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

చినరాజప్పపై ప్రతికూలత వ్యక్తం కావటానికి ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు..పలు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇఛ్చింది. ఈ హామీ అమలుకు నోచుకునే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దీనికి తోడు మంత్రి బంధువర్గంలోని సభ్యులు స్థానికంగా చేసిన పనులు కూడా చినరాజప్పపై వ్యతిరేకత పెరగటానికి కారణాలయ్యాయని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క చినరాజప్పకే కాదు..పలు నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఉభయ గోదావరి జిల్లాల్లోనే టీడీపీకి ఈ పరిస్థితి ఉంటే..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఎలా సాధ్య అవుతుంది?.

Next Story
Share it