Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

0

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కు షాక్. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేని  మాజీ మంత్రి, సీనియర్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ కు షాక్ తగిలినట్లు అయింది. దానం నాగేందర్ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ఉత్తమ్ వెంటనే రంగంలోకి దిగి దానం నాగేందర్ ఇంటికి వెళ్ళి చర్చలు ప్రారంభించారు. మరి అవి ఫలిస్తాయో లేదో తేలాల్సి ఉంది. మరో వైపు దానం అధికార టీఆర్ఎస్ లోకి చేరతారని ప్రచారం జరుగుతోంది. తన రాజీనామాకు కారణాలను శనివారం నాడు మీడియా ముందు వెల్లడించనున్నట్లు దానం నాగేందర్ తెలిపారు.

- Advertisement -

దానం నాగేందర్ కాంగ్రెస్  పార్టీని వీడితే హైదరాబాద్ లో  కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ కిందే లెక్క. ఎన్నికల తరుణంలో కీలక పదవి ఆశించిన నాగేందర్ కు ఇంత వరకూ ఎలాంటి పదవి దక్కకపోవటం కూడా ఆయనలో అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి కూడా ఏకపక్షంగా తనతో సంప్రదించకుండా అంజన్ కుమార్ యాదవ్ కు అప్పగించటంపై కూడా నాగేందర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కాంగ్రెస్ లో హడావుడి చేయగల నేతల్లో దానం నాగేందర్ ఒకరు. ఈ తరుణంలో ఆయన పార్టీని వీడటం కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామమే.

 

Leave A Reply

Your email address will not be published.