Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ఈవీఎంల మోసంతోనే గెలిచిందా?

టీడీపీ ఈవీఎంల మోసంతోనే గెలిచిందా?
X

సహజంగా ఓడిపోయిన పార్టీలు సాకులు వెతుక్కుంటాయి. ఓటమి కారణాల్లో ఒకటిగా ఈవీఎంలను కూడా పడేస్తాయి. అలా పడి ఉంటది అని. గత ఎన్నికల్లో ఏపీలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ మరి ఈవీఎంల మోసంతోనే గెలిచిందా? లేక ప్రజల ఓట్లతో గెలిచిందా?. సరిగ్గా ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించటం విశేషం. టీడీపీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో వ్యాఖ్యానిస్తే...ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే తరహాలో ఏ ఎలక్ట్రానిక్ వస్తువుతో అయినా మోసాలు చేయవచ్చని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో చంద్రబాబు సర్కారు భారీ ఎత్తున అవినీతి ఆరోఫణలతో కూరుకుపోయింది. అంతే కాదు..నాలుగేళ్ళు గడిచినా కూడా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ విషయంలో ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు.

అంతే కాదు...అత్యంత కీలకమైన రైతురుణ మాఫీ కూడా హామీ ఇచ్చినట్లు సంపూర్ణంగా కాకుండా...అరకొరగానే పూర్తి చేశారు. దీనికి తోడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా ఏపీలో ఒంటరి అయ్యారు. గత ఎన్నికల సమయంలో మద్దతు ఇఛ్చిన పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కత్తి దూస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలసి వచ్చేందుకు ఏపీలో కాంగ్రెస్ తప్ప మరో పార్టీ లేదు. ఈవీఎం పద్దతిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, తాజాగా నంద్యాల ఉప ఎన్నికలో గెలిచి కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయటం అంటే..పార్టీలో ఏదో తేడా కొడుతున్నట్లే ఉంది. అంటే ఈ నెపాన్ని కూడా బిజెపిపై నెట్టేసేందుకు ప్లానా ఇది?.

Next Story
Share it