Telugu Gateway
Andhra Pradesh

ముఖ్యమంత్రే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తారా?

ముఖ్యమంత్రే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తారా?
X

కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తారా?.అదీ బహిరంగంగా అమలు చేయను పోండి..ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ ఓ ముఖ్యమంత్రి మాట్లాడటం కలకలం రేపుతోంది. అధికార వర్గాలు సైతం ఏపీ సీఎం చంద్రబాబు మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి మాటలు చూసిన తర్వాత ఎవరైనా కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తారా?. సీఎం స్వయంగా అక్కర్లేదు పొమ్మన్నారు...మేమెందుకు చేయాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చేస్తారు?.

అవసరం లేకపోయినా నాయీ బ్రాహ్మణులతో తొమ్మిదేళ్లు సీఎంగా చేశాను అని చెప్పిన చంద్రబాబుకు...కార్మిక చట్టాల మీద కనీస అవగాహన లేదా?. పైగా స్వయంగా చంద్రబాబు కుటుంబమే ఓ కంపెనీని నడుపుతుంది కదా?. కార్మిక చట్టం ప్రకారం నిర్దేశిత సంఖ్యలో ఉద్యోగులు ఉంటే ఖచ్చితంగా కార్మిక చట్టాలు అమలు చేయాలి. కనీస వేతనాలు ఖచ్చితంగా ఇవ్వాలి కదా?. దుర్గగుడిలో పనిచేస్తున్న క్షురకులకు కార్మికుల చట్టాలను అమలు చేయం అని అలా బహిరంగంగా చెప్పటం ఏమిటి?. చంద్రబాబు తన చర్యల ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి సంతకేతాలు పంపారు. చాలా చోట్ల శ్రమదోపిడీ జరుగుతూనే ఉంది. అయినా సరే కార్మిక చట్టాలను పట్టించుకోవాల్సిన సర్కారే వాటికి గండికొట్టేలా వ్యవహరించటం ప్రమాదకరం అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it