Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘ఎందుకిలా’?

చంద్రబాబు ‘ఎందుకిలా’?
X

ఇది తెలుగుదేశం నేతలతోపాటు ఏపీలోని అధికార వర్గాల్లో ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్న చర్చ. గత కొంత కాలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు..సుజనా చౌదరి తప్పుకున్న రోజు అసలు చంద్రబాబు తీరు చూసి సీఎం పేషీలోని అధికారులు షాక్ కు గురయ్యారు. పేషీలోని ఓ అధికారి ఢిల్లీలో ఉన్న ఓ కీలక నేతకు ఫోన్ చేసి..మీరు అయినా వచ్చి మాట్లాడండి. ఫుల్ సీరియస్ అవుతున్నారు..కోపాన్ని కంట్రోల్ చేయటం కష్టంగా ఉందని సూచించినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు. ఆ తిప్పలు ఏదో మీరే పడండి..నేను రాలేను ఆయన తేల్చిచెప్పటంతో అవాక్కు అవవటం ఆ అధికారి వంతు అయింది. తాజాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్ల బృందం ఆయనతో భేటీకి ప్రయత్నించింది. గంటలు గడిచినా అపాయింట్ మెంట్ ఇవ్వని ఆయన..వెళుతూ..వెళుతూ ఏంది మీరిక్కడ? అంటూ ప్రశ్నించటంతో అవాక్కు అవటం ఆ టీమ్ కు లీడ్ చేస్తున్న బడా కాంట్రాక్టర్ వంతు అయింది.

ప్రభుత్వంలో తమ సంస్థలకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పగానే ..ఓ అధికారిని పురమాయిస్తూ..ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు..చూడండి అంటూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో గతుక్కుమనటం ఆ బడా కాంట్రాక్టర్ వంతు అయింది. తాజాగా నాయీ బ్రాహ్మణుల విషయంలో సచివాలయం రోడ్డుపై జరిగిన సీన్ అందరూ చూసిందే. పార్టీ నేతలు కూడా సంస్థాగతంగా జరుగుతున్న పొరపాట్లు..లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంటే వారిపై కూడా చంద్రబాబు అంతెత్తున మండిపడుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ...చాలా మంది నేతలు ఆయన చెప్పింది చేయటం, వినటం తప్ప..మారు మాట్లాడటం లేవు.

అసలు ఎలాంటి ఫిర్యాదులు కానీ..వాస్తవ పరిస్థితులను చంద్రబాబు ఏ మాత్రం రిసీవ్ చేసుకునే మూడ్ లో లేరని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ఏది చెపితే అది ఓకే అనే టీమ్ మాత్రమే ప్రస్తుతం ఆయన వెంట ఉందని ఓ సీనియర్ నేత తెలిపారు. బిజెపితో పొత్తుకు దూరం కావటం, మరో మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుగుబాటు జెండా ఎగరేయటంతో చంద్రబాబు రాజకీయంగా ఏపీలో ఒంటరయ్యారు. అప్పటి నుంచే అధినేతలో ఆందోళన స్పష్టంగా కన్పిస్తోందని..ఏమి చెప్పినా సీరియస్ అవుతున్నారని అటు అధికారులు..ఇటు పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Next Story
Share it