Telugu Gateway
Andhra Pradesh

బాబు..లోకేష్ లకే హిమాలయ వాటర్!

బాబు..లోకేష్ లకే హిమాలయ వాటర్!
X

ప్రజల సొమ్ము వాడుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు హిమాలయ వాటర్ బాటిల్స్. కానీ ఎవరు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారో అదే ప్రజలకు మాత్రం తాగటానికి మాత్రం మురికినీళ్లు. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి మోడల్. సాక్ష్యాత్తూ రాజధాని ప్రాంతం అయిన విజయవాడలోనూ రక్షిత మంచినీరు కరువే. అక్కడ నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిందే. ఏపీలోని పలు నియోకవర్గాల్లో ఇదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఎప్పుడో ఆయా నగరాలకు 500 కోట్ల రూపాయలు ఇఛ్చినా వాటిని వాడటంలో విపరీత జాప్యం చేశారు. గుంటూరులో చేపట్టిన పనుల్లో మురికినీరు కాస్తా మంచి నీళ్ళలో కలసి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు, లోకేష్ లే కాదు..ఇతర మంత్రులకూ బ్రాండెడ్ నీళ్లే. కాకపోతే అక్కడ కూడా తేడానే. ప్రభుత్వ పెద్దలకు మాత్రమే హిమాలయ వాటర్ బాటిల్స్. మిగిలిన వారికి మాత్రం కిన్లే..ఇతర బ్రాండ్ లు ఇస్తారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య ఆ మాత్రం తేడా ఉండాలి కదా అనుకున్నారేమో చంద్రబాబు.

ఖచ్చితంగా ఇది మెయింటెన్ చేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేనుకు పదిహేను అసెంబ్లీ సీట్లు గత ఎన్నికల్లో టీడీపీకకే దక్కాయి. అయినా అక్కడి ప్రజలకు సురక్షిత మంచి నీరు ఇవ్వటంలో సర్కారు ఫెయిలైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలో ఆదివారం పాదయాత్ర నిర్వహించిన జగన్ అక్కడి ప్రజలు ఇఛ్చిన చెరకు రసంలా కన్పించే నీళ్ల బాటిల్ ను ప్రజలకు చూపించారు. అంతే కాదు..చంద్రబాబు ఈ నీళ్లు మీ అబ్బాయి లోకేష్ కు తాగించు అని సూచించారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే కదా?. అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ కుళాయిల్లో వస్తున్న నీరు చాలా చోట్ల అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Next Story
Share it