Top
Telugu Gateway

అనుష్క సినీ ఇన్నింగ్స్ ఇక అంతేనా?

అనుష్క సినీ ఇన్నింగ్స్ ఇక అంతేనా?
X

అనుష్క. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది. దశాబ్దంపైగా అగ్రనాయకిగా పరిశ్రమలో రారాణిగా వెలుగొందింది. గత కొంత కాలంగా కొత్త సినిమాలను అనుష్క అంగీకరించటం లేదు. ఎప్పటి నుంచో ఆమె పెళ్లి వార్తలు వస్తున్నా...అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అనుష్క పెళ్లి వార్తల షికారు. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ...టాలీవుడ్ కు సంబంధించినంత వరకూ అనుష్క శకం ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలతో కుర్రకారు మతులు పొగొట్టిన ఈ యోగా భామ..తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలతోనూ దుమ్మురేపారు. ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసిందని చెప్పొచ్చు. అనుష్క విషయానికి వస్తే అరుంధతికి ముందు అనుష్క కెరీర్ ఒకెత్తు. అరుంధతి తర్వాత కెరీర్ మరో ఎత్తు. అనుష్క తాజా సినిమా భాగమతి తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏమీ అంగీకరించలేదు. అదే సమయంలో అనుష్కకు ఛాన్స్ లు ఇచ్చే కంటే కొత్త హీరోయిన్ల వైపే నిర్మాతలు..దర్శకులు మొగ్గుచూపుతున్నారు. దీంతో అనుష్కకు కూడా అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పుకోవచ్చు.

గ్లామర్ తప్ప మరేమీ పెద్దగా పట్టించుకోని సినీ పరిశ్రమలో ఓ దశాబ్దంపైగా విజయవంతంగా కొనసాగటం అంటే ఆషామాషీ ఏమీ కాదు. అయితే అనుష్క శిఖరానికి చేరారు. అక్కడ నుంచే ప్రస్తుతం పక్కకు తప్పుకున్నట్లు అయింది. అంటే ఏ పాత్ర దొరికితే ఈ పాత్రలు చేసి వైఫల్యాలు మూటకట్టుకోవటం కన్నా..గౌరవపద్రంగా విజయపరంపర కొనసాగుతున్న సమయంలోనే వైదొలగటం తెలివైన పనే. అయితే అనుష్క పూర్తిగా సినిమాలు గుడ్ బై చెప్పారా? లేదా అన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. ఈ తరుణంలో త్వరలో అనుష్క పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు మళ్ళీ హల్ చల్ చేయటం ప్రారంభించాయి. అయితే ఇందులో నిజం ఉందా? లేక అంతకు ముందు వచ్చిన తరహాలోనే ఇది కూడా పుకారేనా అన్న విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Next Story
Share it