గుడికొచ్చి తరగాల్సింది నా చుట్టూ కాదు...దేవుడి చుట్టూ
BY Telugu Gateway25 Jun 2018 4:54 PM IST

X
Telugu Gateway25 Jun 2018 4:54 PM IST
ఇది ‘పంతం’ సినిమాలో హీరో గోపీచంద్ చెప్పే డైలాగ్. ఈ సినిమాలో గోపీచంద్ కు జంటగా మెహరీన్ నటిస్తోంది. జూలై 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నికల వ్యవస్థలో అవినీతిని ప్రశ్నిస్తూ సినిమాను తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లోనూ అదే విషయం స్పష్టమైంది. గోపీచంద్ తనదైన స్టైల్ తో పాటు..హీరో..హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమా వెరీ రిచ్ లుక్ తో తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. ఈ సినిమాలో ఓవైపు ఎంటర్టైన్మెంట్తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్ సబ్జెక్టును డీల్ చేశారు. కోర్టు సీన్ సన్నివేశాన్ని హైలెట్ గా చూపించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు.
https://www.youtube.com/watch?v=kawW_8S6r60
Next Story