ఒంటరి పోరాటంలో టీడీపీ ఔట్
BY Telugu Gateway2 May 2018 3:33 PM IST

X
Telugu Gateway2 May 2018 3:33 PM IST
గత ఎన్నికల్లో ముగ్గురం కలసి పోటీచేస్తేనే టీడీపికి వచ్చిన ఓట్లు ఐదు లక్షలు మాత్రమే ఎక్కువ. ఇక ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ ఫినిష్ అయినట్లే. ఇవి బిజెపి ఏపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు. తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడి గ్రాఫ్ పడిపోయిందని, అలాగే ఇప్పుడు వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
తిరుపతిలో చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాటం కాదని, అధర్మ పోరాటమని ఎద్దేవా చేశారు. పట్టిసీమపై 15 రోజులలో సీబీఐ చేత విచారణ చేయించాలని కోరతామని తెలిపారు. విచారణ జరిగితేనే దోషులకు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ఏం చెబితే..చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Next Story



