Telugu Gateway
Andhra Pradesh

ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య వ్యాఖ్యల కలకలం

ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య వ్యాఖ్యల కలకలం
X

‘నీ ఫోన్ ఇటు ఇవ్వురా.మీ నాన్న ఏం పనిచేస్తాడు.నీకు ఫోన్ ఎందుకు రా నీకు. వెధవ ఈ లోకం లేడు వాడు. ఇంత మంది ఇక్కడ. పోలీసులు..హడావుడి ఉంటే వెధవ. ఫోన్ ఇస్తే నీ కొడుక్కి ఫిఫ్టీ పర్సెంట్ చెడగొట్టినట్లే. కమ్యూనికేషన్ ఉంటదని ఫోన్ ఇస్తాం. బస్సు ఎక్కాం..దిగాం. ఆ నా కొడుకు అసలు వినటం లేదు. అది డేంజర్ అన్న మాట. వాళ్ళ నాన్నకు ఏమీ ఉపయోగపడడు. ఈ వెదవ పరీక్ష కూడా రాసి ఉండడు. ఎస్సీనా నువ్వు. మాలా..మాదిగా?. మాదిగ అయితే అస్సలు చదవరు నా కొడుకులు.ఇంటర్మీడియట్ వీడు. చుట్టుపక్కల పరిశీలించుం అంటాం. వాడు పరిశీలించటలా? చదువుకో బాగా. మీ అయ్య ఏమి చేస్తాడు? పెయింటర్. మీ అమ్మ. ఎన్ని ఎకరాల పొలం ఉంది?. బ్యాంకులో డబ్బు ఎంత ఉంది.మరి ఎలా చదువుకుంటాం. కష్టపడి చదువుకోవాలి.

ఇవన్నీ మానేసి. ఫోన్లు అన్నీ మానేసి చదువుకో. నువు కూడా అవసరం అయితే సెలవుల్లో పనికి వెళ్లాలి. కూలి పనికి వెళ్లాలి. ఆ డబ్బు నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి’ ఇదీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మచిలీపట్నం బస్టాండ్ లో బస్సులో ఉన్న ప్రయాణికుడితో చేసిన వ్యాఖ్యలు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడితో ఆర్టీసీ ఛైర్మన్ వాడిన భాష ఇది. వర్ల రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. ఛైర్మన్ అయినంత మాత్రాన ఓ ప్రయాణికుడిని పట్టుకుని వాడూ..వీడు అనటం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ప్రయాణికుడి కులం అడగాల్సిన అవసరం ఏమి ఉందని..ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదని వర్ల రామయ్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీడియో సాక్షిగా వర్ల రామయ్య వ్యాఖ్యలు రికార్డు అయినా..ఆయన మాత్రం తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు అని..కులపెద్దగా కుర్రోడికి సూచనలు చేసినట్లు చెబుతున్నారు.

Next Story
Share it