Telugu Gateway
Andhra Pradesh

‘టీటీడీ’లో ఎవరు చెప్పేది నిజం!

‘టీటీడీ’లో ఎవరు చెప్పేది నిజం!
X

కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ ఇప్పుడు ‘రాజకీయం’ తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల్లోనూ ‘లెక్కలేనన్ని’ తప్పులు ఉన్నట్లు కన్పిస్తున్నాయి. అయితే ఎవరికి వారు తమ తమ వాదనలు విన్పిస్తూ భక్తులను గందరగోళంలోకి నెడుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో? అవేంటో ఓ సారి చూద్దాం.

ఇప్పుడే ఎందుకు?

 1. రమణ దీక్షితులు ఆకస్మికంగా టీటీడీలో అక్రమాలు కనిపెట్టారా?.
 2. ఆయన తాను చెబుతున్న అక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులైన టీటీడీ ఈవో, జెఈవోకు..దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, మంత్రికి ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా?.
 3. ఫిర్యాదు చేసినా ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదా?.
 4. పోటులో తవ్వకాలు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ప్రధాన అర్చకుడిని ఎవరు అడ్డుకున్నారు?.
 5. కొన్ని నెలలుగా స్వామివారికీ ‘నైవేద్యం’ కూడా పెట్టలేకపోతున్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం ముందు పెట్టలేదు?
 6. అసలు చెన్నయ్ వెళ్ళి విలేకరుల సమావేశం పెట్టాల్సిన అవసరం రమణదీక్షితులకు ఎందుకొచ్చింది?.

7.ప్రభుత్వానికి..ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కాబట్టే ప్రజల ముందుకు వచ్చినట్లు చెప్పే ఆధారాలు రమణదీక్షితుల దగ్గర ఉన్నాయా?

 1. అధికారుల అక్రమాలపై రమణదీక్షితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? అయినా ప్రభుత్వం పట్టించుకోలేదా?.
 2. ఏడాది కాలం పాటు ‘బోర్డు’ లేకుండా చేయటం వల్లే అక్రమాలు జరిగాయా?
 3. బోర్డు లేని సమయంలోనే అస్మదీయ అధికారులతో కావాల్సిన పనులు చేసుకున్నారా?

ప్రభుత్వ వైఫల్యాలు

1.ఎనిమిదేళ్ళుగా టీటీడీ జెఈవోగా శ్రీనివాసరాజునే కొనసాగించాల్సిన అవసరం ఏముంది?. శ్రీనివాసరాజును మించిన గొప్ప అధికారి ఎవరూ ప్రభుత్వానికి కనపడలేదా?

 1. ఏడాది కాలం పాటు బోర్డు వేయకుండా సీఎం చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారు. తనకు నచ్చిన వారిని వేసుకునే సౌలభ్యం ఉన్నా జాప్యం వెనక కారణాలేంటి?
 2. రమణదీక్షితులు ఆరోపణలు చేయగానే..ఆయన చాలా తప్పులు చేశారని సాక్ష్యాత్తూ ఉప మంత్రి కె ఈ కృష్ణమూర్తి ప్రకటన చేయటం వెనక మర్మమేమిటి?
 3. తప్పులు చేసినా కూడా రమణదీక్షితులపై ఇంత వరకూ ఎందుకు చర్యలు తీసుకోకుండా వదిలేశారు?
 4. ప్రధాన అర్చకుడే అడ్డగోలు ఉల్లంఘనలు చేస్తుంటే చోద్యం చూడాల్సిన అంత దీన స్థితిలో ప్రభుత్వం ఎందుకు ఉంది?
 5. రమణదీక్షితులు ఆరోపణలు చేసిన వెంటనే టీటీడీ బోర్డులో పెట్టి మరీ వయోపరిమితిని 65 సంతవ్సరాలకు పరిమితం చేసి వేటు వేయటానికి కారణమేంటి?.
 6. అప్పటివరకూ రమణదీక్షితులు చేసిన తప్పులను వదిలేసి...ప్రభుత్వ అక్రమాలను బహిర్గతం చేయటం వల్లే వేటువేశారా?.
 7. దేవుడికి ఎన్ని అపచారాలు చేసినా కూడా చూస్తూ వదిలేస్తారా?.
 8. అంటే దేవుడి పవిత్రతను కాపాడటం కంటే...ప్రభుత్వానికి చంద్రబాబు ఇమేజ్ కాపాడటమే ముఖ్యమా?.
 9. అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు విషయంలో ఇప్పుడే ఎందుకు ఇన్ని వివాదాలు తలెత్తాయి?
 10. ఇప్పుడు టీడీపీ శ్రేణులు రమణదీక్షితుల పొలాలు..భవనాలు, ఆస్తులు..కార్లు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టడం వెనక మతలబు ఏమిటి?
 11. అంటే ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా ఎంత దోచుకున్నా ఏమీ అనరు అన్న మాట..తప్పు ఎత్తిచూపితే నువ్వు కూడా అదే టైపు అని చెప్పి ‘బ్యాలెన్స్’ చేసుకుంటారా?
 12. భక్తుల మనోభావాలు...టీటీడీ పవిత్రత గుర్తుకు రాదా ప్రభుత్వానికి?

Next Story
Share it