‘టీటీడీ’లో ఎవరు చెప్పేది నిజం!
BY Telugu Gateway22 May 2018 10:37 AM IST
X
Telugu Gateway22 May 2018 10:37 AM IST
కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ ఇప్పుడు ‘రాజకీయం’ తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల్లోనూ ‘లెక్కలేనన్ని’ తప్పులు ఉన్నట్లు కన్పిస్తున్నాయి. అయితే ఎవరికి వారు తమ తమ వాదనలు విన్పిస్తూ భక్తులను గందరగోళంలోకి నెడుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో? అవేంటో ఓ సారి చూద్దాం.
ఇప్పుడే ఎందుకు?
- రమణ దీక్షితులు ఆకస్మికంగా టీటీడీలో అక్రమాలు కనిపెట్టారా?.
- ఆయన తాను చెబుతున్న అక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులైన టీటీడీ ఈవో, జెఈవోకు..దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, మంత్రికి ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా?.
- ఫిర్యాదు చేసినా ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదా?.
- పోటులో తవ్వకాలు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ప్రధాన అర్చకుడిని ఎవరు అడ్డుకున్నారు?.
- కొన్ని నెలలుగా స్వామివారికీ ‘నైవేద్యం’ కూడా పెట్టలేకపోతున్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం ముందు పెట్టలేదు?
- అసలు చెన్నయ్ వెళ్ళి విలేకరుల సమావేశం పెట్టాల్సిన అవసరం రమణదీక్షితులకు ఎందుకొచ్చింది?.
7.ప్రభుత్వానికి..ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కాబట్టే ప్రజల ముందుకు వచ్చినట్లు చెప్పే ఆధారాలు రమణదీక్షితుల దగ్గర ఉన్నాయా?
- అధికారుల అక్రమాలపై రమణదీక్షితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? అయినా ప్రభుత్వం పట్టించుకోలేదా?.
- ఏడాది కాలం పాటు ‘బోర్డు’ లేకుండా చేయటం వల్లే అక్రమాలు జరిగాయా?
- బోర్డు లేని సమయంలోనే అస్మదీయ అధికారులతో కావాల్సిన పనులు చేసుకున్నారా?
ప్రభుత్వ వైఫల్యాలు
1.ఎనిమిదేళ్ళుగా టీటీడీ జెఈవోగా శ్రీనివాసరాజునే కొనసాగించాల్సిన అవసరం ఏముంది?. శ్రీనివాసరాజును మించిన గొప్ప అధికారి ఎవరూ ప్రభుత్వానికి కనపడలేదా?
- ఏడాది కాలం పాటు బోర్డు వేయకుండా సీఎం చంద్రబాబు ఎందుకు మిన్నకుండి పోయారు. తనకు నచ్చిన వారిని వేసుకునే సౌలభ్యం ఉన్నా జాప్యం వెనక కారణాలేంటి?
- రమణదీక్షితులు ఆరోపణలు చేయగానే..ఆయన చాలా తప్పులు చేశారని సాక్ష్యాత్తూ ఉప మంత్రి కె ఈ కృష్ణమూర్తి ప్రకటన చేయటం వెనక మర్మమేమిటి?
- తప్పులు చేసినా కూడా రమణదీక్షితులపై ఇంత వరకూ ఎందుకు చర్యలు తీసుకోకుండా వదిలేశారు?
- ప్రధాన అర్చకుడే అడ్డగోలు ఉల్లంఘనలు చేస్తుంటే చోద్యం చూడాల్సిన అంత దీన స్థితిలో ప్రభుత్వం ఎందుకు ఉంది?
- రమణదీక్షితులు ఆరోపణలు చేసిన వెంటనే టీటీడీ బోర్డులో పెట్టి మరీ వయోపరిమితిని 65 సంతవ్సరాలకు పరిమితం చేసి వేటు వేయటానికి కారణమేంటి?.
- అప్పటివరకూ రమణదీక్షితులు చేసిన తప్పులను వదిలేసి...ప్రభుత్వ అక్రమాలను బహిర్గతం చేయటం వల్లే వేటువేశారా?.
- దేవుడికి ఎన్ని అపచారాలు చేసినా కూడా చూస్తూ వదిలేస్తారా?.
- అంటే దేవుడి పవిత్రతను కాపాడటం కంటే...ప్రభుత్వానికి చంద్రబాబు ఇమేజ్ కాపాడటమే ముఖ్యమా?.
- అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు విషయంలో ఇప్పుడే ఎందుకు ఇన్ని వివాదాలు తలెత్తాయి?
- ఇప్పుడు టీడీపీ శ్రేణులు రమణదీక్షితుల పొలాలు..భవనాలు, ఆస్తులు..కార్లు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టడం వెనక మతలబు ఏమిటి?
- అంటే ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా ఎంత దోచుకున్నా ఏమీ అనరు అన్న మాట..తప్పు ఎత్తిచూపితే నువ్వు కూడా అదే టైపు అని చెప్పి ‘బ్యాలెన్స్’ చేసుకుంటారా?
- భక్తుల మనోభావాలు...టీటీడీ పవిత్రత గుర్తుకు రాదా ప్రభుత్వానికి?
Next Story