Top
Telugu Gateway

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
X

ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించిన తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రావతరణ దినోత్సవానికి ముందు నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఒకేసారి మొత్తం 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 16,925 పోస్టులు కానిస్టేబుళ్లు. 1503 ఎస్సై ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కానిస్టేబుళ్ళకు ఇంటర్మీడియట్ అర్హత. కానిస్టేబుల్‌, ఎస్‌ఐ నియామకాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పోలీసు నియామక బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 9 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హోం గార్డులుగా ఏడాది పనిచేసిన వారికి మాత్రం సడలింపులు ఇఛ్చారు. సాధ్యమైనంత వేగంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సర్కారు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించి..ఈ నియామక పక్రియను పూర్తి చేయనున్నారు.

Next Story
Share it