Telugu Gateway
Cinema

ఐటెం సాంగ్స్ భామగా తమన్నా

ఐటెం సాంగ్స్ భామగా తమన్నా
X

ఏ ఒక్క ఛాన్స్ ను వదులుకోవటం లేదు మిల్కీ బ్యూటీ తమన్నా. అది పూర్తి స్థాయి సినిమా అయినా..ఐటెం సాంగ్ అయినా..దేనికైనా రెడీ అంటున్నారు ఈ భామ. ఇఫ్పటికే పలు ఐటెం సాంగ్స్ లో ఆడిపాడి సక్సెస్ అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ మరోసారి అదే రూట్ లో వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఇటీవల జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ తో జోడీ కట్టి ‘స్వింగ్ జరా’ సాంగ్ తో ఓ ఊపు ఊపింది తమన్నా. ప్రస్తుతం నాగచైతన్యతో కలసి డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి పాటలకు నిర్మాతలు భారీ ఎత్తున పారితోషికం ఇస్తుండటం కూడా హీరోయిన్లు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఓ వైపు అగ్రహీరోలు అందరితో కలసి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే కూడా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణలు కలసి దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్ ..’ సాంగ్‌ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్‌ చేస్తున్నారు. ఈ ప్రత్యేక గీతంలోనే చైతూతో కలిసి స్టేజ్‌ పంచుకోనున్నారు తమన్నా. ఈ సాంగ్‌ను వచ్చే నెలలో షూట్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ వేస్తున్నారు.

Next Story
Share it