రమణదీక్షితులను బొక్కలో వేసి నాలుగు తంతే...

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం నాడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఎవరు?. బొక్కలో వేసి నాలుగు తంతే నిజాలు అన్నీ బయటకు వస్తాయి. భయం లేకుండా పోయిందా మీకు? అసలు రమణదీక్షితులు ఎవరు?. టీటీడీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తారా?. నాశనం అయిపోతారు అంటూ శపించారు. అదే సమయంలో బిజెపి, వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమణదీక్షితుల వంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. టీటీడీ అంశాన్ని బజారుకెక్కించాలని ఆయన అనుకుంటున్నారని ఆక్షేపించారు.
చెత్త రాజకీయాలు పక్కనబెట్టండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్షితులు ఏమేం తప్పులు చేశారో మొత్తం తమకు తెలుసునని అన్నారు. ‘రమణ దీక్షితులూ.. మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులూ.. ఎన్నో రోజులు లేవు. అనుభవిస్తారు మీరు. పత్రికల్లో, చానళ్లలో మీరన్న మాటల గురించి వార్తలు చదవాలా?’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించే నేతలు రమణదీక్షితులకు వ్యతిరేకంగా టీటీడీ సిబ్బందితో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని నిర్ణయించి అభాసుపాలైంది. టీటీడీని రాజకీయాలకు వాడుకోవటంలో ఇతర పార్టీలకు తోడు టీడీపీ కూడా తక్కువ ఏమీ తినలేదు.