‘డ్రైవర్ రాముడు’ మళ్ళీ వస్తున్నాడు
BY Telugu Gateway23 May 2018 10:22 AM IST

X
Telugu Gateway23 May 2018 10:22 AM IST
అవును. డ్రైవర్ రాముడు మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నాడు.అయితే అప్పటి ఎన్టీఆర్ సినిమా కాదు ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఉన్న షకలక శంకర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ప్రస్తుతం షకలక శంకర్ హీరోగా నటించే ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా లాంఛ్ చేయించారు. ప్రదీప్‌సింగ్ రావత్‌కి శంకర్ మధ్య జరిగే సరదా డైలాగులతో టీజర్‌ను చూపించారు. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శంకర్ మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్గానూ కథ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. అంచల్ సింగ్ శంకర్‌కు జోడీగా నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=bvXygqCuuKU
Next Story



