Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి ‘ఉక్కిరిబిక్కిరి’!

రేవంత్ రెడ్డి  ‘ఉక్కిరిబిక్కిరి’!
X

ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఎక్కడ?. ఇది కాంగ్రెస్ పార్టీతోపాటు..ఇతర పార్టీల నేతల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం. కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ఆ పార్టీలోని రాజకీయాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది ఆ పార్టీ నేతల నుంచి. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వాయిస్ విన్పించకుండా పోయింది. టీపీసీసీ ప్రచార బాధ్యతలు రేవంత్ కు ఇస్తారని ప్రచారం జరిగినా.. ఆ పదవి వచ్చేలా కన్పించటం లేదని ప్రచారం జరుగుతోంది. రేవంత్ కు ఆ పదవి ఇస్తే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమ సంగతేమిటని కొంత మంది నేతలు అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రేవంత్ కు ప్రచార బాధ్యతలు వస్తాయా? రావా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. దానికి కూడా ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. అయితే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి ప్రచార బాధ్యతలు ఇస్తే పార్టీలో కొంత ఊపురావటం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఓ వైపు పార్టీలో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఉంటే..బయట కూడా రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పటం లేదు. మీడియాలో రేవంత్ పై అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. తెలంగాణ సర్కారుకు సంబంధించి ఎంత పెద్ద సంచలన విషయం ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి బయటపెట్టినా కూడా మీడియాలో దానికి చోటుదక్కటం లేదు. దీని వెనక ‘పెద్దల’ హస్తం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఛానల్స్ లో కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్య ఎక్కడా కన్పించటం లేదు. దీని వెనక కూడా రాజకీయం ఉందని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ వార్తల్లో ఉంటే రేవంత్ రెడ్డి సడన్ గా ఎందుకు సైలెంట్ అయిపోయారని అన్నది అటు రాజకీయ వర్గాలతోపాటు..ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

‘భరత్

Next Story
Share it