Telugu Gateway
Cinema

‘ఎర్ర హీరో’ మాదాల అస్తమయం

‘ఎర్ర హీరో’ మాదాల అస్తమయం
X

ఒకప్పుడు ‘ఎర్ర హీరో’ అంటే ఒక్క మాదాల రంగారావే. ఆయన మాత్రమే ప్రజాసమస్యలతో కూడిన సందేశాత్మక సినిమాలు తీసేవారు. ఈ తరహా సినిమాల్లో నటించటమే కాకుండా..నిర్మాతగా కూడా వ్యవహరించారు ఆయన. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చికిత్స పొందుతూనే ఆయన ఆదివారం తెల్లవారుజామున మరణించారు. మాదాల రంగారావు వయస్సు 70 సంవత్సరాలు. మాదాల రంగారావు ప్రకాశం జిల్లా మైనం పాడులో జన్మించారు. 1948 మే 25న ఆయన జన్మించారు.

నవతరం పిక్చర్స్‌ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశారు. 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, విప్లవశంఖం, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించి ఎర్ర హీరోగా పాపులర్ అయ్యారు.

Next Story
Share it