పంచ్ డైలాగులతో నేలటిక్కెటు ట్రైలర్

నేలటిక్కెటు సినిమా ఫుల్ మాస్ మసాలాలతో నిండి ఉన్నట్లు కన్పిస్తోంది. కొత్తగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అదే విషయాన్ని ధృవపరుస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఫుల్ ఎనర్జిటిక్ రోల్ పోషించినట్లు కన్పిస్తోంది. అంతే కాదు..పంచ్ డైలాగులతో కూడా అదరగొడుతున్నాడు. ఈ సినిమా మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సొగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో సత్తా చాటిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. నేల టిక్కెట్టు సినిమా గురువారం సెన్సార్‌కు వెళుతోంది. ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. రవితేజ సరసన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
https://www.youtube.com/watch?v=0-Q2KDmDX8E