నేలటిక్కెటు షూటింగ్ పూర్తి
BY Telugu Gateway8 May 2018 8:10 AM GMT

X
Telugu Gateway8 May 2018 8:10 AM GMT
రవితేజ కొత్త సినిమా నేలటిక్కెట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళుతున్న ఈ మాస్ మహారాజా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అక్కడక్కడ కొంత నిరాశ ఎదురైనా జోరు మాత్రం తగ్గటం లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నేలటిక్కెట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా మళవిక శర్మ హీరోయిన్ గా నటించారు.
సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ పూర్తి అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అదే సమయంలో యూనిట్ మొత్తాన్ని చాలా మిస్ అవుతున్నందుకు ఒకింత బాధగా ఉందని అంటూ ట్వీట్ చేశారు కల్యాణ్ కృష్ణ. మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
Next Story