Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మరో మైనర్ బాలికపై రేప్

ఏపీలో మరో మైనర్ బాలికపై రేప్
X

ఏపీలో మైనర్ బాలికలపై వరస పెట్టి జరుగుతున్న రేప్ లు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి ఘటన ఓ వైపు కలకలం రేపుతుంటే...పశ్చిమ గోదావరి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పాల్గొన్న వారంతా కూడా మైనర్ లే. తణుకు మండలం తేతలి గ్రామంలో ఐదేళ్ళ బాలికపై పదిహేను సంవత్సరాల బాలుడు అత్యాచారం చేశాడు. అతనికి మరో ముగ్గురు మైనర్ యువకులు సహకరించారు. వేసవి సెలవులు కావటంతో ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను నలుగురు యువకులు వచ్చి చాక్లెట్ కొనిస్తామని చెప్పి పాఠశాలలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.

స్కూల్ బాత్ రూమ్ లో నిందిడుతు ఈ అరాచకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత బాలికి ఇంటికెళ్ళగా తీవ్ర రక్తస్రావం అవుతున్న విషయం గమనించి కుటుంబ సభ్యులు అడగటంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Next Story
Share it