రామ్ గోపాల్ వర్మ సినీ పాఠాలు
BY Telugu Gateway27 May 2018 12:32 PM IST

X
Telugu Gateway27 May 2018 12:32 PM IST
రామ్ గోపాల్ వర్మ మారిపోతున్నారు. అదేంటి అంటారా?. ఆయన కొత్త అవతారం ఎత్తనున్నారు. ఒకప్పుడు టాప్ డైరక్టర్ గా ఉన్న వర్మకు ప్రస్తుతం కాలం కలసి రావటం లేదు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుని తరహాలో తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన అనుభవాన్ని కొత్త తరానికి అందించేందుకు వర్మ కొత్త ప్లాన్ వేశారు.
అదే ‘ఆర్జీవి అన్ స్కూల్’ పేరుతో సినీ పాఠాలు చెప్పనున్నారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిలతో కలిసి ఆర్జీవీ అన్‌స్కూల్ పేరుతో ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. నాగార్జునతో హీరోగా వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్’ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story



