Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా!

పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజ హీరోగా నటించిన నేలటిక్కెట్లు సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీరిద్దరూ పక్కన పక్కనే కూర్చున్న సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా వర్మ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజ వేసుకున్న టోర్ జీన్స్ లో వేలు పెట్టి పవన్ కాసేపు రవితేజను నవ్వించే ప్రయత్నం చేశాడు. అంతే వర్మ..దాన్ని ఆసరా చేసుకుని తన ట్విట్టర్ కు పని చెప్పాడు. ‘అజ్ణాతవాసి పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందని రవితేజ మొహంలో క్లియర్ గా టచ్ చేసి చూడు టైపులో తెలుస్తోంది.

కానీ ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి కూడా తెలిసుండదు. పవన్ కళ్యాణ్ రవితేజ తొడమీద వున్న తన అత్యంత శ్రద్ధలోని జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే అబ్బో అత్యంత సస్యశ్యామలమే అని వ్యాఖ్యానించారు. రవితేజ ఎడమ తొడకి పవన్ కళ్యాణ్ కుడి చేతికి ఉన్న అవినాభావ సంబంధం ఆ దేవుడికే తెలియాలి. పవన్ కళ్యాణ్ కి రవితేజ ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకె మొంలో ఉన్న ఆనందంలో కనపడుతుంది’ అని ట్వీట్ చేశారు.

Next Story
Share it