కర్ణాటక స్పీకర్ ఎన్నికలో కొత్త మలుపు

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. మెజారిటీ ఉంది..ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటూ ముందుకొచ్చి భంగపడిన అతిపెద్ద పార్టీ బిజెపి..స్పీకర్ ఎన్నికలోనూ ట్విస్ట్ ఇచ్చింది. తొలుత తాము స్పీకర్ ఎన్నిక బరిలో ఉంటామని ప్రకటించి..చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. దీంతో కాంగ్రెస్ తరపున స్పీకర్ బరిలో నిలిచిన కె ఆర్ రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.తొలుత స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ పేరును సిద్దరామయ్య ప్రతిపాదించారు. ఆ వెంటనే రమేష్ కుమార్ పేరును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర బలపరిచారు.
అయితే చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే సురేష్ కుమార్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంఖ్యాబలం లేదని చర్చించుకున్న అనంతరం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ నేత రమేష్ కుమార్ మరోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి స్పీకర్ అయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నూతన స్పీకర్ రమేష్ కుమార్ దగ్గరికెళ్లి మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు.