‘కాలా’ ట్రైలర్ వచ్చేసింది
BY Telugu Gateway28 May 2018 3:37 PM GMT
X
Telugu Gateway28 May 2018 3:37 PM GMT
‘నేల నీకు అధికారం. నేల మాకు జీవితం. కాలా దాదా ఎవరు?. రావణ్ అంటూ నానా పాటేకర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులతో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాలా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో రజనీకాంత్ తనదైన స్టైల్ తో అదరగొట్టాడు. మన దేహమే ఒక ఆయుధం, ఇది ప్రపంచానికి తెలియాలి. ప్రజలారా కదలిరండి అంటూ రజనీ డైలాగ్ లు ఈ ట్రైలర్ లో హైలెట్ గా ఉన్నాయి.
కాలా సినిమా కు పా రంజిత్ దర్శకత్వం వహించగా..ధనుష్ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కాలా సినిమాలో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కీలకపాత్ర పోషించారు. జూలై 7న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
https://www.youtube.com/watch?v=ugkjeXAyrJE
Next Story