Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆ దర్శకుడు నమ్మకద్రోహి

0

పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా ఉన్న ఓ వ్యక్తిని టార్గెట్ చేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.  ఓ దర్శకుడు తన నాలుగు కుటుంబాల సాయంతో ఎన్నారై హీరోయిన్ కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. తనకు హిట్స్ లేవని చెబుతున్నారని..మరి  ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు.కొన్ని ఉద్యోగాలు చేయకుండా ఉండటమే మంచిదన్నారు. ఆ దర్శకుడితో జాగ్రత్త..నమ్మకద్రోహి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు పూనమ్ కౌర్ నేరుగా చెప్పకపోయినా తన వ్యాఖ్యల ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.

- Advertisement -

‘జల్సాలు చూపిస్తూ అజ్ణాతవాసంలో  పడేస్తారు’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఎన్ఆర్ఐ హీరోయిన్ తో సదరు దర్శకుడికి వివాదం తలెత్తగా ..తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత ఒకరు రంగంలో దిగి సెటిల్ చేసినట్లు కూడా గతంలో వార్తలు వెలువడ్డాయి. ఇఫ్పుడు పూనమ్ కౌర్ ఈ వ్యవహారాన్ని తెరపైకి తేవటంతో ఈ అంశంపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తన వ్యాఖ్యలను తప్పుపట్టిన వారికి కూడా పూనమ్ ఘాటుగా బదులిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.