Telugu Gateway
Cinema

శర్వానంద్ కొత్త లుక్

శర్వానంద్  కొత్త లుక్
X

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో నాని తర్వాత వరస పెట్టి హిట్లు కొడుతున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. గతంతో పోలిస్తే సినిమాల స్పీడ్ కూడా పెంచాడు. శర్వానంద కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ కొత్త చిత్రమే ‘పడి పడి లేచే మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ‘పడి పడి లేచే మనసు’ మూవికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతమందించగా, ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story
Share it