నాగార్జున ‘ఆఫీసర్’ ట్రైలర్ 12న
రామ్ గోపాల్ వర్మ...నాగార్జున కాంబినేషన్ అంటే ఓ సంచలనమే. దీనికి బలమైన కారణం ‘శివ’ సినిమా ఒకటి. మరి ఇంతటి హిట్ ఇచ్చిన వీరిద్దరూ కలిస్తే సహజంగానే అంచనాలు అంతే బారీగా ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, లోగోతో పాటు తొలి టీజర్‌ను విడుదల చేసి వర్మ.. తాజాగా ఆఫీసర్ 2వ టీజర్‌ను రిలీజ్ చేశారు. గత కొంతకాలం నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్న వర్మ నాగ్‌తో చేసిన మూవీలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కును రెండో టీజర్‌లో చూపించాడు. ఇప్పటికే ఆఫీసర్ షూటింగ్ పూర్తైయింది. నాగ్ కొలీగ్‌గా మైరా సరీన్ నటించారు. తెరంగేట్రం చేస్తున్న అన్వర్ ఖాన్ విలన్ రోల్ పోషించాడు. ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు.
https://www.youtube.com/watch?v=0fFw-q98GQY