Telugu Gateway
Andhra Pradesh

‘లోకేష్’ ఐటి శాఖలో అడ్డంగా బుక్కయ్యారు!

‘లోకేష్’ ఐటి శాఖలో అడ్డంగా బుక్కయ్యారు!
X

ఆంధ్రప్రదేశ్ ఇన్పర్ మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్కయ్యారు. అసలు తానేమీ తప్పుచేయలేదని..ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరిన నారా లోకేష్ సడన్ గా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపు జీవోలో కీలక మార్పులు చేయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దశల వారీగా భూమి ఇవ్వమని సూచించినా...కేబినెట్ ముందు పెట్టి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఎందుకు ‘మార్పులు’ చేయాల్సి వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే మరి ఈ సవరణ అవసరం ఏమోచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాల అంశాన్ని ‘తె లుగు గేటే వే. కామ్’ తొలుత వెలుగులోకి తెచ్చింది. విశాఖపట్నంలోని రుషికొండలో ఉన్న 400 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని కారుచౌకగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..ఇన్నోవా సొల్యూషన్స్ కు కేటాయించారు.. ఇందులో 25 ఎకరాలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు, మరో 15 ఎకరాలు ఇన్నోవా సొల్యూషన్స్ కు కేటాయిస్తూ ఒకే జీవో జారీ చేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్..ఇన్నోవా సొల్యూషన్స్ ముందుపంచుకున్నట్లుగానే..సర్కారు కూడా అలాగే జీవో జారీ చేసింది.

ఇప్పుడు ఆ జీవోలో మార్పులు చేశారు. మార్పుల ప్రకారం తొలి దశలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు 25 ఎకరాలు కేటాయిస్తారట. ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ పాలసీ ప్రకారం గరిష్టంగా 7 సంవత్సరాల్లో ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన 15 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు విక్రయిస్తారట. ఏదైనా కారణంతో ఈ సంస్థ 15 ఎకరాలను కొనుగోలు చేయటంలో విఫలమైతే..ఇతర సంస్థలకు కేటాయిస్తారు. సవరించిన జీవోలోనూ ఓ గోల్ మాల్ జరిగింది. అసలు తొలి జీవోలో ఉన్న ఇన్నోవా సొల్యూషన్స్ పేరు మారిన జీవోలో లేకుండా పోయింది. లోకేష్ స్కామ్ బయటపడుతుందని ఆ పనిచేశారా? లేక ఎందుకు ఈ మార్పులు చేశారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంత ఖరీదైన భూములను కేటాయించే సమయంలో ప్రాజెక్టు అమలు చేస్తేనే సేల్ డీడ్ ఇవ్వాలి. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం ముందే 25 ఎకరాలకు సేల్ డీడ్ ఇచ్చేస్తోంది. అడ్డగోలుగా అక్రమాలు చేస్తూ కూడా తన అవినీతికి ఆధారాలు చూపించాలని లోకేష్ డిమాండ్ చేయటం విశేషం. అసలు ఇన్నోవా సొల్యూషన్స్ తెరపై నుంచి ఎందుకు తప్పుకుందో చంద్రబాబు, లోకేష్ లో చెప్పాలి. అసలు రెండు కంపెనీలకు ఒకే జీవోలో కేటాయింపులు చేయటమే ఓ విచిత్రం అని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.

Next Story
Share it