‘నీవెవరో’ అంటున్న ఆది
![‘నీవెవరో’ అంటున్న ఆది ‘నీవెవరో’ అంటున్న ఆది](https://telugugateway.com/wp-content/uploads/2018/05/Neevevaro.jpg)
ఆది పినిశెట్టి. పలానా పాత్రలే కావాలని గిరిగీసుకుని కూర్చోకుండా తనకు దక్కిన పాత్రలు అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు. ఓ వైపు హీరో పాత్రలు పోషిస్తూనే..మరో వైపు విలన్ గానూ చేస్తున్నాడు. రంగస్థలం వంటి సినిమాలో రామ్ చరణ్ అన్నగా నటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది ‘వైరం ధనుష్’గా విలన్ పాత్రలో అద్భుత నటన కనపర్చి మంచి మార్కులు కొట్టేశాడు. స్టైలిష్ విలన్ గా ఈ సినిమాలో ఆది కన్పించాడు. అలాగే నిన్నుకోరి సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా కన్పించనున్నాడు.
రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న కొత్త సినిమానే ‘నీవెవరో’. ఇందులో హీరో ఆదినే. ఈ సినిమాలో ఆది పినిశెట్టికి జోడీగా తాప్సీ, రితికా సింగ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, లోగో ను న్యాచురల్ స్టార్ నాని గురువారం నాడు విడుదల చేశారు. టైటిల్ ను విడుదల చేసిన తర్వాత ‘నువ్వు చెప్పిన కధకు టైటిల్ అదిరింది బాబాయ్’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఆది, తాప్సీ గతంలో గుండెల్లో గోదారి సినిమాలో కలసి చేశారు.