Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘ఆఫీసర్’ ట్రైలర్ వచ్చేసింది

0

సినిమా విడుదలకు ముహుర్తం దగ్గర పడుతుండటంతో ‘ఆఫీసర్’ చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా మైరా సరీన్ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి చిత్రం. ఇప్పటికే ఆఫీసర్ కు సంబంధించి రెండు టీజర్లు విడుదల చేసి వర్మ …శనివారం నాడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగార్జున ముంబయ్ మాఫియాతో పోరాటం సాగించే పోలీసు అధికారిగా కన్పించనున్నారు.

- Advertisement -

మాఫియా కథలు అంటే వర్మకు కొట్టిన  పిండి. ‘శివ’ తర్వాత నాగార్జున, వర్మలు కలసి చేస్తున్న సినిమా ఇదే కావటంతో అందరికీ దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వర్మ ఫెయిల్యూర్స్ తో ఉన్న నాగార్జున కూడా ఈ సినిమాకు ఓకే చెప్పేశాడు. వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్లకు పెద్ద ఎత్తున డిజ్ లైక్స్ వస్తున్నా వర్మ సవాళ్ళు విసురుతున్నారే తప్ప.. ఏమాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదు. పైగా పవన్ ఫ్యాన్స్ ఇంత తక్కువ మందే ఉన్నారా? అంటూ వెటకారాలు ఆడారు ఈ మధ్య.

Leave A Reply

Your email address will not be published.