నాగార్జున ‘ఆఫీసర్’ విడుదల వాయిదా
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆఫీసర్’. వర్మ, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి. ఎందుకంటే శివ వంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. వాస్తవానికి ఈ సినిమా మే 25న విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల కారణంగా సినిమా విడుదలను జూన్ 1న విడుదల చేయనున్నట్లు దర్శకుడు వర్మ ట్విట్టర్ లో ప్రకటించారు. క్వాలిటీ పరంగా సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు.
ఆఫీసర్ ట్రైలర్ ను బిగ్ బీ అమితాబచ్చన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. అంతే కాదు..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తన ప్రియమిత్రుడు నాగార్జున సినిమా ఇది అని పేర్కొన్నారు. దీనిపై వర్మ స్పందిస్తూ బిగ్ బి కి థ్యాంక్స్ చెబుతూ..‘సర్కార్’కు ప్రత్యేకంగా ఈ సినిమా చూపిస్తామని వెల్లడించారు. నాగార్జున, తాను కలసి ఈ సినిమా అమితాబ్ కోసం ప్రత్యేక షో వేస్తామన్నారు.