Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ సినిమా ఐదు షోలు

అల్లు అర్జున్ సినిమా ఐదు షోలు
X

సమ్మర్ సీజన్ లో విడుదలవుతున్న మరో పెద్ద సినిమా నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా. ఇప్పటికే విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియాపైనే ఉంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడి..వెరైటీ స్టెప్స్ వేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ అభిమానులకు మరో శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఐదు షోలకు ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఇది సినిమాకు కలసి రానుంది. అల్లు అర్జున్ గత సినిమాలు అన్నీ కూడా కలెక్షన్ల పరంగా పాజిటివ్ ఫలితాలనే సాధించాయి. దీంతో ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిర్మాతలు లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీ నుంచి ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. మే 4న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం చాలా సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓవైపు వేసవి సెలవులు కావడం... మరోవైపు ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో మరో షోకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయమన్నారు.

Next Story
Share it