Telugu Gateway
Telangana

చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
X

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కన్నీటిపర్యంతరం అవుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం. తెలంగాణ లో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ను పడగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారు. మాల ...మాదిగ ల మధ్య తన అవసరాల కోసం చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. చంద్రబాబు నట చక్రవర్తి. బిసిలు...కాపుల మధ్య కోట్లాట పెడుతున్నారు చంద్రబాబు . చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ వ్యవస్థకు చంద్రబాబు ముప్పు. పవన్ ...జగన్ సొంత జెండాలు పెట్టుకున్నారు ...వాళ్ళు మొగోళ్లు. రాజ్యసభ సీట్లను కూడా వందల కోట్లకు అమ్ముకుంటున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు పార్టీ పగ్గాలు అప్పగించాలి.

ఎన్టీఆర్ దగ్గర టిడిపి జెండాను దొంగతనం చేశారు చంద్రబాబు. మహానాడు లో ఎన్టీఆర్ పేరు ఉచ్చరించడానికి వీలు లేదు. కాపులకు ఎప్పటిలోగా రిజర్వేషన్లు ఇస్తావో చెప్పు చంద్రబాబు ఎన్టీఆర్ దయ వల్ల నా లాంటి పేదలు రాజకీయలలో ఉంటున్నారు . పార్టీ పేదవాళ్లకు కానీ...పెత్తనందరి వారి కోసం కాదని ఎన్టీఆర్ అన్నారు. నన్ను ఆలేరు ప్రజలు కాపాడారు. నా రాజకీయ జీవితం ను బలి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా కుట్రలకు బలి అయ్యారు.’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన మహానాడుకు కూడా మోత్కుపల్లి దూరంగా ఉన్నారు. కనీసం తనకు ఆహ్వానం లేదని చెబుతున్నారు. అప్పటి నుంచి నేరుగా విమర్శలు చేస్తున్నారు. అయితే మోత్కుపల్లి పార్టీని వీడేందుకు నిర్ణయించుకునే తీవ్ర విమర్శలు చేసినట్లు భావిస్తున్నారు.కెసీఆర్ కు చంద్రబాబు సరెండర్ అయ్యారని ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టులో వందల కోట్లు కమిషన్లు తీసుకున్నారన్నారు. అవసరం అయితే ఆంధ్రాలో రథయాత్ర చేస్తానని ప్రకటించారు.

Next Story
Share it