Telugu Gateway
Telangana

డబ్బు లేకుండా చంద్రబాబు సర్కారులో ఏమీ కాదు

డబ్బు లేకుండా చంద్రబాబు సర్కారులో  ఏమీ కాదు
X

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం నాడు మరోసారి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శులు చేశారు. చంద్రబాబు సర్కారులో డబ్బు లేకుండా ఏ పని కాదన్నారు. రాజ్యసభ సీట్లను కూడా వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాను తిరుమల వెంకన్నను ఏమీ కోరుకోలేదని..త్వరలో కొండకు వెళ్ళి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని మాత్రం కోరతానన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికి మోడీ కాళ్ళు పట్టుకుంది నువ్వు కాదా?. నువ్వు ఢిల్లీ అన్నిసార్లు తిరిగింది ప్రత్యేక హోదా కోసం కాదు..కేసుల నుంచి బయటపడేందుకే. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి నువ్వు పోయావా?. నీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడా?. అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. నర్సింహులు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ గతంలో చంద్రబాబు ఎన్టీఆర్ గొంతు కోసినట్లే నా గొంతు కోశారు. ఎందుకంటే నేను ఎన్టీఆర్ శిష్యుణ్ణి అయినందుకే. ఆయనకు ప్రజా సొమ్ము దోసుకోవడానికి మాత్రమే సమయం ఉంది మిగతా వాటికి సమయం లేదు.

గతంలోనే 1995 లో ఎన్టీఆర్ చంద్రబాబు ను సస్పెండ్ చేశాడు దానికి ఈ లేఖనే సాక్ష్యం. ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేశావ్. నువ్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ పన్నావ్, అప్పుడు నువ్ కాంగ్రెస్ లో ఉన్నావు. బిడ్డను ఇచ్చినందుకు నువ్ మోసం చేశావ్. నువ్ నమ్మకద్రోహివి అని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. పేదలను మోసం చేసిన వ్యక్తుల్లో నువ్ మొదటి వ్యక్తి. నిన్ను ఏం అడిగాను పదవులు ఎప్పుడు అడిగాను. నువ్ ఇది ఆడిగావు నీవు అని నిరూపించు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నిన్ను తిడితే తట్టుకోలేని వ్యక్తివి ఏ కులం వారు తిడితే వారితోటి తిట్టిపిస్తావ్.. నీది ఎం నీతి. ఇదేనా నువ్ ఇచ్చే మర్యాద. తెలుగు దేశం పార్టీ లో నుండి పోయిన వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వం ను కూల్చాలి అని చూసిన దుర్మార్గుడివి నీవు నన్ను నీ అవసరాల కోసం వాడుకున్నావ్.

నెల ముందు తొడకొట్టిన నీవు ఎందుకు రాత్రికి రాత్రే అమరావతి పారిపోయినవు. హుటాహుటిన ఢిల్లీ కి వెళ్లి బీజేపీ వాళ్ళ కళ్ళు మొక్కావ్. అప్పుడు కేసీఆర్ నిన్ను క్షమించాడు. రేవంత్ రెడ్డి ని పట్టుకొని మాలాంటి వారిని దూరం పెట్టడం తగునా నీకు. ప్రజల సొమ్మును వృధా చేసి తట్టబుట్ట సదురుకొని పారిపోయావ్. నీవా మాదిగ జాతికి న్యాయం చేసేది, నువ్వా మాదిగల కోసం పోరాటం చేసేది. అంబేడ్కర్ విగ్రహం పెడితే మాదిగ జాతి సహించదు. నువ్ ఒక్క సవటవి, నీవు ఒక్క బ్రోకర్ హౌస్ నడిపే వ్యక్తివి. ఇక్కడ పార్టీని మొత్తం నాశనం చేశారు. నీవల్ల ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు నీ వల్ల. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే డిపాజిట్ కూడా రాలేదు నీ మొహం చూసి ఓట్లు వేసేరోజు పోయింది. రాబోయే కాలంలో నీకు అధికారం రాదు నిన్ను రాజకీయంగా బొంద పెడతారు. ఇన్ని రోజులు ఆయనకు సపోర్ట్ చేసినందుకు నన్ను క్షమిచండి. కేంద్ర ప్రభుత్వం ను అడుగుతున్నా చంద్రబాబు మీద సీబీఐ విచారణ చేపట్టాలి’ అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

Next Story
Share it