‘భరత్’లో కొరటాల ఆ సీన్ ఎందుకు కట్ చేశారు?
ఫిల్మ్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే సీన్ ను ఎందుకు సినిమాలో జోడించలేదు. నిడివి ఎక్కువైందని ఆపేశారా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను, రాజకీయాలను, అన్ని రాజకీయపార్టీలను శాసించే స్థాయిలో బలపడిపోయిన కార్పొరేట్ విద్యా మాఫియా సీన్ భరత్ అనే నేను సినిమా నుంచి లేపేశారు. వాస్తవానికి ఇది ఎంతో బాగుంది. ప్రజలకు సూపర్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. సీఎంతో సమావేశం అయిన కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు నేరుగా సీఎం భరత్ తో మీకు ఏమైనా కావాలంటే అందరం కలసి ఇస్తామని నేరుగా ఆఫర్ ఇస్తారు.. అంతే..విద్యా శాఖ మంత్రి తనయుడిని లాగిపెట్టి చెంప మీద కొడతారు భరత్.
అంతే కాదు..ఇలాంటి చెత్త మీటింగ్ లు మరోసారి ఏర్పాటు చేస్తే బాగుండదని ఏకంగా సీఎస్ కు కూడా వార్నింగ్ ఇస్తాడు భరత్. ఈ సీన్ నిజంగా సినిమాలో పెట్టి ఉంటే చాలా హైలెట్ అయ్యేదని చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. తాజాగా సూపర్ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్ చేశారు. నిడివి కారణంగానే సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస‍్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాస్తవానికి రెండు భాగాలుగా విడుదల చేయాల్సినంత మెటీరియల్ ఇందులో ఉందని కొరటాల పలుమార్లు మీడియాకు తెలిపారు.
https://www.youtube.com/watch?v=KG_j5q-NQ54