Telugu Gateway
Andhra Pradesh

పొగడ్తల్లోనూ చంద్రబాబు..లోకేష్ ల క్విడ్ ప్రో కో

పొగడ్తల్లోనూ చంద్రబాబు..లోకేష్ ల క్విడ్ ప్రో కో
X

నువ్వు నన్ను పొగుడు. నేను నిన్ను పొగుడుతా. పొగడ్తల్లోనూ ఇదో తరహా క్విడ్ ప్రోకో లా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఇదే తంతు సాగుతోంది. వేదిక ఏదైనా సరే నిత్యం ఈ సీన్ ప్రజలందరూ చూస్తున్నదే. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఒకే వేదికపై ఉంటే ఆ సీన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరూ ఒకే వేదికపై లేకపోయినా పొగడ్తలతో పోయేది ఏముంది అన్న చందంగా ఈ వ్యవహారం సాగుతుంది. లోకేష్ అయితే పొగడ్తల విషయంలో మరీ పీక్ కు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు. ఇంత వయస్సులో చంద్రబాబులా కష్టపడే వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారా?. కొద్దిసేపు ఎక్కువ పనిచేస్తే ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా? అని నేను చూస్తుంటా? కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. అలసట లేకుండా నిత్యం పనిలోనే ఉంటారు. చివరకు మనవడిని కూడా చూడకుండా రాష్ట్రం కోసం తపిస్తున్నారు. ఇలాంటి సీన్లు మనం ఎన్నో చూశాం. అరే లోకేష్ ఇంత కష్టపడి నన్ను పొగుతుతుంటే నేను పట్టించుకోకపోతే ఫీల్ అవుతాడు అనుకున్నారో...ఏమో కానీ చంద్రబాబు కూడా అదే గేమ్ స్టార్ట్ చేశారు.

ఛాన్స్ దొరికినప్పుడల్లా లోకేష్ పై పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ‘నాకు టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేదు కానీ..లోకేష్ ఈ రంగంలో ఉన్న అనుభవంతో దూసుకెళ్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించారు ఈ మధ్య’. కలెక్టర్ల సమావేశంలోనూ పేరు పెట్టకుండానే పంచాయతీరాజ్ శాఖ నూతన అన్వేషణల విషయంలో ముందు ఉందని..మిగిలిన శాఖలు కూడా ఈ దిశగా దృష్టి సారించాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్న సంగతి తెలిసిందే. అంటే లోకేష్ తప్ప..ఎవరూ ఏమీ చేయటం లేదని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఈ మధ్య లోకేష్ ఎవరూ ఊహించని రీతిలో ‘స్వీయ సర్టిఫికెట్లు’ ఇచ్చుసుకుంటున్న తీరు చూసి అందరూ అవాక్కు అవుతున్నారు కూడా. తన సక్సెస్ స్టోరీ యువతకు ఆదర్శం అంటూ లోకేష్ ఈ మధ్య సంచలన ప్రకటన చేశారు. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి...చంద్రబాబు తనయుడు అనే కారణంతో మంత్రి పదవి దక్కించుకోవటం సక్సెస్ సోర్టీ అవుతుందా?. అలా కావాలంటే ఏపీలో సీఎంల సంఖ్యను భారీ ఎత్తున పెంచాల్సి ఉంటుందేమో?!. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ లు తప్ప ఎవరూ పనిచేయటంలేదనే కలర్ ఇచ్చేస్తున్నారు ఇద్దరూ కలసి.

Next Story
Share it