Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

క్రిష్ కు ‘ఎన్టీఆర్ బయోపిక్’ బాధ్యతలు

0

ప్రచారమే నిజమైంది. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు జాగర్లమూడి క్రిష్ కు అప్పగించారు ఈ విషయాన్ని చిత్ర హీరో..నిర్మాత నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన భారీ ప్రాజెక్టుపై స్పష్టత ఇఛ్చారు. ఇఫ్పటికే బాలకృష్ణ, క్రిష్ లు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో కలసి చేశారు. తొలుత దర్శకుడు తేజ ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను చేపట్టారు. అయితే కారణాలేంటో స్పష్టంగా వెల్లడికాలేదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఆయన పక్కకు తప్పుకున్నారు. నటీ, నటుల ఎంపికలో వివాదం తలెత్తటమే దీనికి కారణం అని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

‘జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి మోగించే తెలుగోడు జయగీతి నినదించే మొనగాడు..ఎన్టీఆర్. నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు.. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకీ ఎవరో ఇప్పుడు తెలిసింది’ అంటూ బాలకృష్ణ తన వాయిస్ తో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన కథకు క్రిష్  దర్శకుడిగా రావటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.