చంద్రబాబు రాజకీయాలను తిరస్కరించారు
BY Telugu Gateway15 May 2018 12:39 PM IST

X
Telugu Gateway15 May 2018 12:39 PM IST
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఊపుతో ఉన్న బిజెపి నేతలు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని టార్గెట్ చేయటం ప్రారంభించారు. కర్ణాటకలో చంద్రబాబు రాజకీయాలను తెలుగు ప్రజలు తిరస్కరించారని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే హైదరాబాద్ కర్ణాటకలో తమ సీట్లు 6 నుంచి 20కి పెరిగాయని పేర్కొన్నారు. దీన్ని బట్టే చంద్రబాబు రాజకీయాలు కర్ణాటకలో నడవలేదని అర్థం అవుతుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలతో దక్షిణాది దిశగా తమ యాత్ర ప్రారంభం అయిందని అన్నారు.
Next Story