Telugu Gateway
Politics

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ లోనూ గందరగోళం

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ లోనూ గందరగోళం
X

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ప్రజల్లో మరింత గందరగోళం పెంచాయి. కొన్ని ఛానల్స్ బిజెపిదే గెలుపు అని చెపితే..మరికొన్ని మాత్రం లేదు లేదు...కాంగ్రెస్ ముందు వరసలో ఉంటుందని తేల్చాయి. దీంతో ఎవరికీ ఫలితాలు అంతు చిక్కేలా లేవు. కాాకపోతే అందరూ హంగ్ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు కన్పిస్తోంది. కొన్ని మాత్రం బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెబుతున్నాయి. నువ్వా..నేనా అన్నట్లు సాగిన కర్ణాటక ఎన్నికల సమరం శనివారం పోలింగ్ తో ముగిసింది. ఇక మిగిలింది ఫలితాల వెల్లడి మాత్రమే. త్వరలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలు ఎన్నికలు ఎలాంటి గందరగోళాలు లేకుండా సాఫీగానే పూర్తయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాన ఛానల్స్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ 106 నుంచి 118 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చింది. బిజెపికి 79 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేశారు. జెడీఎస్ 22 నుంచి 30 సీట్లకు పరిమితం కానుంది. ఇతరులు 1నుంచి 4 సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 90 నుంచి 103 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. బిజెపి 80 నుంచి 90 సీట్లు దక్కించుకునే అవకాశం కన్పిస్తోంది. జెడీఎస్ 31 నుంచి 39 సీట్లకు పరిమితం అవుతోంది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 93 నుంచి 103 సీట్లు రావొచ్చని తేలింది.

బిజెపి 80 నుంచి 93 సీట్లు దక్కించుకోనుంది. జెడీఎస్ 31 నుంచి 39 సీట్లు రావొచ్చని తేల్చారు. రిపబ్లిక్ టీవీ మాత్రం బిజెపి 94 నుంచి 114 సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ కు 73-83 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. జెడీఎస్ కు 35 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేశారు. న్యూస్ ఎక్స్ కూడా బిజెపికే 102-110 సీట్లు వస్తాయని తన ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. కాంగ్రెస్ 72 నుంచి 78 సీట్లకు పరిమితం అవుతుందని చెబుతున్నారు. సీఎన్ఎన్ న్యూస్ 18 కూడా కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 103 సీట్లు, బిజెపికి 80-93 సీట్లు, జెడీఎస్ 31 నుంచి 39 సీట్లు వస్తాయని పేర్కొంది. అయితే ఎక్కువ ఛానల్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీనే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చిచెప్పాయి. మొదటి నుంచి కూడా ఇవే సంకేతాలు అందాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే అసలు ఫలితాలు తేలాలంటే మే 15 వరకూ వేచిచూడాల్సిందే. అయితే ఎలా చూసినా జెడీఎస్ కీలక పాత్ర పోషించే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే కాంగ్రెెస్ కు స్పష్టమైన మెజారిటీ రాకపోతే మాత్రం జెడీఎస్ తో కలసి బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు బలంగా విన్పిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టాయనే చెప్పొచ్చు.

Next Story
Share it