ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
BY Telugu Gateway17 May 2018 6:24 PM IST

X
Telugu Gateway17 May 2018 6:24 PM IST
ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమా తర్వాత చేస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్..టైటిల్ వెల్లడి చేసేందుకు ముహుర్తం ఖరారైంది. యంగ్ టైగర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్, సినిమా పేరును వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ అయిన హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
జైలవకుశ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తదుపరి చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి ఉంది. సహజంగా ఏ స్టార్ హీరో పుట్టిన రోజు అయినా ఫ్యాన్స్ హంగామా సహజమే. ఎప్పటిలాగానే పుట్టిన రోజు సర్ ప్రైజ్ లు అందించటానికి కొత్త సినిమా యూనిట్ కూడా సిద్ధమైంది. తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 19 సాయంత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Next Story



