Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ పాత్ర...నా వల్ల కాదన్నాను

ఎన్టీఆర్ పాత్ర...నా వల్ల కాదన్నాను
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేయాల్సిందిగా స్వప్న నా దగ్గరకు వచ్చి కోరింది. కానీ ఆయన పాత్రను పోషించడం ఈ జన్మలో జరగని పని. నాకు బేసిక్‌గా ఈ చిత్రంలో రామారావుపాత్ర పోషించే దమ్ము లేదు. మనకు తెలిసిన కథలో, ఆ కథలోని వ్యక్తిలాగా నటించడం చాలా కష్టం. అది నటిస్తే జరగదు. జీవిస్తే జరుగుతుంది. కానీ కీర్తీ సురేశ్, దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ ఈ నలుగురూ వాళ్ల వాళ్ల పాత్రల్లో జీవించారు’ అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. సావిత్రి జీవిత చరిత్రపై తెరకెక్కించిన మహానటి సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. దీనికి ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజయంతి మూవీస్‌ ఎన్టీఆర్ వల్ల మొదలైంది. స్వప్న సినిమాస్‌ నా ‘స్టూడెంట్‌ నెం.1’తో మొదలైంది. ఈరోజు ఇంత గొప్ప సినిమా తీస్తారని అనుకోలేదు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ మధ్య ఆడవాళ్ల మీద ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ సినిమా చూశాక ఎందుకు మనం మగాళ్లుగా పుట్టాం అని అనుకుంటారు.

ఒక స్త్రీ బలమేంటో... ఆడవాళ్లు తలుచుకుంటే ఏం సాధిస్తారో సావిత్రిగారు చూపించారు. ఇప్పటికైనా ఆడవాళ్లను గౌరవిస్తారని కోరుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు తారక్. నాగార్జున మాట్లాడుతూ ‘‘అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, సావిత్రి.. ఈ ముగ్గురి పేర్లు తెలుగు సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయే ఉంటాయి. వాళ్లు లేకుండా ‘మాయాబజార్‌’ సినిమా లేదు. నన్ను 8 నెలల వయసులో ఎత్తుకొని ‘వెలుగు నీడలు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేశారు సావిత్రిగారు. తన దగ్గరి నుంచే స్టార్‌డమ్‌ నాకు అంటుకొని ఉంటుంది. సావిత్రిగారిని చూసిన వెంటనే భయపడి నాన్నగారి వెనక్కో, అమ్మ కొంగు చాటుకో వెళ్లిపోయేవాణ్ణి. ఒక వ్యక్తి మీద బయోపిక్‌ తీయాలంటే వారికి ఓ అర్హత ఉండాలి. ఆ అర్హత సావిత్రి గారికి ఉంది. తెలుగు సూపర్‌స్టార్‌ మీద వస్తున్న ఫస్ట్‌ బయోపిక్‌. అది కూడా ఒక లేడీ సూపర్‌ స్టార్‌. మనందరం గర్వపడాలి. అది తీసింది కూడా స్వప్నా, ప్రియాంకా. పాతికమంది అమ్మాయిలు సినిమా టీమ్‌లో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీలో స్త్రీలకు అంత గౌరవం ఇస్తాం. ఈ సినిమాలో భాగమవ్వనందుకు చాలా ఈర్ష్యగా ఉంది. నేను లేకపోయినా నా కొడుకు, కోడలున్నారు ఈ సినిమాలో. ట్రైలర్, టీజర్‌ చూస్తే ఒక మంచి ఫీలింగ్‌ కలుగుతుంది.

ఇప్పటి వరకూ మీరు ఎన్నో హిట్స్‌ ఇచ్చారు అశ్వనీదత్‌గారూ.. ఈ సినిమా మీకు రెస్పెక్ట్‌ తీసుకువస్తుంది’’ అన్నారు. ‘‘సావిత్రిగారి గురించి మాట్లాడే వయసు నాకు లేదు. కీర్తీ ఎంత కష్టపడిందో తెలుసు. ఇందులో పని చేసిన అందరితో నాకు అనుబంధం ఉంది. ఫస్ట్‌ టైమ్‌ అనిపిస్తోంది నా సినిమాలో నేను లేనే అని. ఇందులో నేనూ యాక్ట్‌ చేయాల్సింది. కుదర్లేదు. నాగీ సినిమాల్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇందులోనూ కనిపిస్తుంది’’ అన్నారు నాని. కీర్తీ సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘నాని ద్వారా ఈ సినిమా గురించి విన్నాను. నాగీ, స్వప్నా నా దగ్గరకి వచ్చి, నువ్వు టైటిల్‌ రోల్‌ చేయాలన్నారు. నేను సావిత్రిగారి పాత్ర చేయడమేంటి? అనుకున్నాను. కానీ నాగీ కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. మనం సావిత్రిగారికి ఇచ్చే నివాళి అని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ నాగీ. సావిత్రిగారు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.

Next Story
Share it