మహానటిపై ఎన్టీఆర్

ఈ మధ్య కాలంలో ‘మహానటి’ సినిమాకు వచ్చినన్ని ప్రశంసలు ఏ సినిమాకు రాలేదని చెప్పొచ్చు. విమర్శకుల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకూ మహానటి విషయంలో చాలా వరకూ ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అక్కడక్కడా సినిమాలో ‘లోపాల’ను కొంత మంది లేవనెత్తినా...అవి పెద్దగా నిలబడలేదు. సహజంగా ఒక సినిమాపై ఇంతటి ప్రశంసలు అరుదనే చెప్పొచ్చు. కానీ మహానటి మాత్రం దీనికి మినహాయింపు. ఈ సినిమా గురించి చెప్పటానికి మాటలు సరిపోవని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్ తో సావిత్రిగారే అలా చేయించి ఉంటారనేలా సినిమా ఉందన్నారు.
సావిత్రి గారికి నాగ్ అశ్విన్ ఇచ్చిన ఘనమైన నివాళి అని వ్యాఖ్యానించారు. చిత్ర యూనిట్ అందరికీ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ తోపాటు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా మహానటి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూస్తే కన్నీరు ఆపుకోవటం కష్టం అన్నారు. సావిత్రిపై ఎంతో ప్రేమతో ఈ సినిమాను తెరకెక్కించారన్నారు. ఈ సినిమా ఓ గొప్ప నటికి మళ్ళీ జీవం పోసిందన్నారు. కీర్తి సురేష్, సమంతల నటనపై కూడా జయప్రకాష్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT