‘అరవింద సమేత’ ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ విడుదల
ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ‘అరవింద సమేత రాఘవ’గా ఖరారు చేశారు. ఈ విషయాన్నిచిత్ర యూనిట్ శనివారం నాడే ప్రకటించింది. అంతే కాదు...ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇఫ్పటికే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆదివారం ఎన్టీఆర్ పుట్టిన రోజు. సినిమాపై క్రేజ్ పెంచేందుకు వరస పెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ గోడపై ఎన్టీఆర్, హీరోయిన్ పూజా హెగ్డె కూర్చుని ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు.
ఇది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్డీఆర్ ఆదివారం నాడు 35వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో పొలిటికల్ ట్విస్టులు కూడా ఉంటాయంటున్నారు. జైలవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే.
https://www.youtube.com/watch?v=RoJcS9Un72U