చంద్రబాబు అవినీతిని వదిలిపెట్టే ప్రశ్నేలేదు
బిజెపి స్పీడ్ పెంచింది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిని వదిలిపెట్టే ప్రశ్నేలేదని తేల్చిచెప్పారు. సొల్లు కబుర్లు ఆపి ఏదైనా ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం 420 వ్యవహారాలు..దగాకోరు వ్యవహారం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు దుర్వినయోగం అవుతుంటే చూస్తూ ఎలా ఉరుకుంటాం అని ప్రశ్నించారు. కాగ్ నివేదికలు కూడా ఏపీలో దారుణంగా దోపిడీ జరిగిందని చెబుతున్నాయన్నారు. . ఇలాంటి ఆరోపణలు ఉన్న మీ ప్రభుత్వానికి నిధులు ఇవ్వటం అంటే మీ పార్టీ ఎలక్షన్ ఫండ్ కు నిదులు ఇచ్చినట్లే. ప్రజలకు ఇస్తాం తప్ప..మీ ఫండ్ కోసం వాడుకోవటానికి కాదు. చంద్రబాబు ప్రవర్తన ఊసరవెల్లికి కూడా సిగ్గు తెప్పించేలా ఉంది. కంప్లీట్ యూ టర్న్. చంద్రబాబు ప్రత్యేక హోదాపై పలుసార్లు మాట మార్చి ఇప్పుడు హోదా ఉద్యమ సమితి ఛైర్మన్ లాగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదేమి సినిమా కాదు..ట్విస్ట్ లు..టర్న్ లు తీసుకోవటానికి. సినిమా వేషం కాదు.. కొత్త రంగు..కొత్త వేషం వేయటానికి. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాధించాం అని మీరే చెప్పారు. ఎస్పీవీ అంటే ముందుకు రావటం లేదు. డబ్బలు ఖర్చు పెట్టకుండా యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. కేంద్ర అధికారులు క్షేత్రస్థాయిలో చూసి వచ్చారు. ఎన్ని నిధులు ఇఛ్చినా దుర్వినియోగం. అవినీతి పాలవుతున్నాయి. మీకు నిధులు ఇఛ్చేటప్పుడు ప్రతి చోటా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చేసిన తప్పుడు మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. ధోలేరాకు 98 వేల కోట్లు ఇచ్చాం అని చెప్పిన పచ్చి దగా కోరు అబద్ధం ప్రజలను వంచించటానికి కాదా?. ఏపీకి మూడు ఇండస్ట్రీయల్ సిటీలు రాబోతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రానికి మూడు పారిశ్రామిక సిటీలు ఇవ్వలేదు. ఒక్క ఏపీకే ఇస్తున్నాం. మాకు రాష్ట్రం పట్ల ప్రేమ ఉండబట్టే ఏపీకి మూడు పారిశ్రామిక సిటీలు ఇఛ్చాం. గప్ చుప్ గా పనులు చేసుకుంటూ సొంత డబ్బా కొట్టుకోవటానకి వాడుకుంటున్నారు. కేంద్రానికి ఏ మాత్రం క్రెడిట్ ఇవ్వటానికి మనసు మాత్రం చంద్రబాబుకు రావటం లేదు. 2010-11 ధోలేరా సిటీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన నిర్ణయం. మౌలికసదుపాయాల కల్పనకు మాత్రమే కేంద్రం 2500 కోట్ల రూపాయలు ఇస్తుంది. కేంద్రంలో బిజెపి వచ్చాక కొత్తగా మంజూరైన ఇండస్ట్రీయల్ కారిడార్స్ లో ఏపీకి చెందిన కృష్ణపట్నం ప్రాంతం కూడా ఉంది. ఢిల్లీ- ముంబై కారిడార్‌లో దొలారే సిటీ నిర్మాణం చేయాలనే నిర్ణయం యూపీఏ హయాంలో జరిగిందని జీవీఎల్ గుర్తు చేశారు. ‘రూ. 2,333 కోట్లతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకాన్ని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుంది. రూ. 300 కోట్లను రూ.3 వేల కోట్లగా.. అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పారిశ్రామిక నగరాన్ని క్యాపిటిల్ సిటీతో పోలిస్తే ఎలా అని ప్రశ్నించారు.