Telugu Gateway
Cinema

అరవిందకు మరో జోడీ

అరవిందకు మరో జోడీ
X

‘అరవింద సమేత రాఘవ’కు మరో జోడీ కుదిరింది. ఇప్పటికే ఈ సినిమా పూజా హెగ్డె ఉండగా..ఇఫ్పుడు కొత్తగా మరో భామ వచ్చి చేరనుంది. ఆమె ఎవరో కాదు...అచ్చమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కూడిన ఫస్ట్ లుక్ ను ఈ మధ్యే విడుదల చేశారు. అంతే కాదు...మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ రెండింటికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది.

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని కొంత వరకు కన్ఫర్మ్ చేసినట్లు అయింది. జైలవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న కొత్త ప్రాజెక్టు ఇదే. దీని తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత డీ వీ వీ దానయ్య నిర్మిస్తున్నారు.

Next Story
Share it