Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్!

చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్!
X

తెలుగుదేశం పార్టీకి చిక్కులు తప్పవా?. నిన్న మొన్నటి వరకూ ఒకటే సమస్య ఉండేది. ఇప్పుడు డబుల్ ధమాకా తప్పేలా లేదు. ఓ వైపు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కొంత మంది మంత్రులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ...కేంద్రం నిధులు ఇవ్వటంలేదని చేస్తున్న ప్రచారంపై బిజెపి అధిష్టానం చాలా గుర్రుగా ఉంది. ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్ వంటి అంశాలను మాత్రం హామీ ఇచ్చి విస్మరించారు బిజెపి నేతలు. అయినా కూడా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి..చివరి నిమిషంలో మాట మార్చి...తమను బద్నాం చేయటం ఏమిటనేది బిజెపి నేతల వాదన. ఇది ఒకెత్తు అయితే కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా బిజెపిని ఓడించాలని టీడీపీ గట్టి ప్రయత్నాలే చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీ ఉప ముఖ్య మంత్రి కె ఈ కృష్ణమూర్తి బెంగూళూరు పర్యటన సందర్భంగా బిజెపిని ఓడించాలని అక్కడి తెలుగు ప్రజలను కోరారు. టీడీపీ ప్రాయోజిత నేతలు కొంత మంది..సోషల్ మీడియా విభాగం బిజెపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.

అయినా ఫలితం మరోలా వచ్చింది. దీంతో చంద్రబాబు, టీడీపీపై బిజెపి కసి రెట్టింపు అయింది. చంద్రబాబు సర్కారుపై ఎప్పటి నుంచో తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నా బిజెపి కూడా చూసీచూడనట్లు వదిలేసింది. అయితే తమను ఏపీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం ఒకెత్తు అయితే...కర్ణాటకలో రాజకీయంగా తమను చంద్రబాబు దెబ్బతీసే ప్రయత్నాలు చేయటాన్ని ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చాలా సీరియస్ గా తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అండ్ కోపై చర్యలకు అంతా రంగం సిద్ధం చేశారని..అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందని ఓ నేత వ్యాఖ్యానించారు. వాస్తవానికి కర్ణాటకలో గెలిచినా..ఓడినా చంద్రబాబు సర్కారుపై చర్యలు తప్పేవీ కాదని చెబుతున్నారు. ఓడితో కసితో చర్యలు ఉండేవని..ఇప్పుడు గెలుస్తున్నందున ఆ ఆనందంతో చంద్రబాబుపై కసి తీర్చుకుంటారని చెబుతున్నారు.

Next Story
Share it