ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్ విసిరేసిన మండలి వైస్ ఛైర్మన్

దూషణలు. సవాళ్ళు. ఆగ్రహావేశాలు. వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని మండలి వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఆగ్రహాంతో ఊగిపోతూ వెధవ, నోర్మూయ్ అంటూ బూతులు తిట్టేశారు. అంతే కాదు..అందిన వాటిల్ బాటిల్ ను విసిరేశారు. మైకు కూడా విసిరేందుకు ప్రయత్నించగా..పక్కనున్న వారు అడ్డుకుని ఆయన్ను బయటకు తీసుకెళ్ళారు.. ఇదంతా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం లో చోటుచేసుకున్న ఘటన. టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ సమావేశంలో ఎవరూ ఊహించని స్థాయిలో రెచ్చిపోయారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై రెడ్డి సుబ్రహ్మణ్యంను జెడ్పీ సమావేశం వేదికగా ప్రశ్నించారు. జగ్గిరెడ్డి ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొన్ని పేపర్లు చూపిస్తూ ఏదో చెబుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.